Suella Braverman : సుయెల్లా బ్రేవర్‌మాన్ రాజీనామా

భార‌త సంత‌తికి చెందిన న్యాయ‌వాది

Suella Braverman : భార‌తీయ సంత‌తికి చెందిన న్యాయ‌వాది, యుకెలో మంత్రిగా ఉన్న సుయెల్లా బ్రేవ‌ర్ మాన్(Suella Braverman) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆమె ప్ర‌వాస భార‌తీయుడు రిషి సున‌క్ టీం స‌భ్యురాలిగా ముద్ర ప‌డ్డారు. తాజాగా లిజ్ ట్ర‌స్ ఎన్నిక కావ‌డంతో ఒక్క‌రొక్క‌రు త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు బోరిస్ జాన్సన్ కేబినెట్ లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌చ్చారు సుయెల్లా. బ్రేవ‌ర్ మ‌న్ హోం సెక్ర‌ట‌రీ పాత్ర‌లో కేవ‌లం 43 రోజులు మాత్ర‌మే ప‌ని చేశారు. త‌ను రాజీనామా చేసేందుకు వ‌ర‌కు ఆమె బ్రిట‌న్ అంత‌ర్గ‌త మంత్రి ప‌ద‌విగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా లిజ్ ట్ర‌స్ క్యాబినెట్ నుండి ఒక వారం లోపు వైదొలిగిన రెండ‌వ సీనియ‌ర్ క్యాబినెట్ మంత్రి కావ‌డం విశేషం.

1960లో యుకెకు వ‌ల‌స వెళ్లిన పేరెంట్స్ కు సుయెల్లా ఏకైక సంతానం. మిస్ట‌ర్ బ్రేవర్ మాన్ తండ్రి హౌసింగ్ అసోసియేష‌న్ లో ప‌ని చేస్తుండ‌గా త‌ల్లి 40 ఏళ్ల‌కు పైగా న‌ర్సుగా ఉన్నారు. 2018లో హౌస్ ఆఫ్ కామ‌న్స్ లో మెర్సిడెస్ లో మేనేజ‌ర్ అయిన రేల్ బ్రేవ‌ర్ మాన్ ను పెళ్లి చేసుకుంది.

ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. సుయెల్లా లండ‌న్ లోని హీత్ ఫీల్డ్ స్కూల్ లో చ‌దువుకుంది. కేంబ్రిడ్జ్ లోని క్వీన్స్ కాలేజీలో లా చ‌దివింది. యూనివ‌ర్శిటీ ఆఫ్ పారిస్ 1, పాంథియోన్ సోర్బోన్ నుండి న్యాయ‌శాస్త్రంలో మాస్ట‌ర్స్ డిగ్రీని క‌లిగి ఉంది. సుయెల్లా న్యూయార్క్ అటార్నీ గా అర్హ‌త కూడా సాధించింది.

2005 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో లీసెస్ట‌ర్ ఈస్ట్ నుంచి పోటీ చేయ‌డంతో ఆమె రాజ‌కీయ జీవితం ప్రారంభ‌మైంది. 2015లో క‌న్స‌ర్వేటివ్ పార్టీ స‌భ్యురాలిగా ఎన్నికైంది. 2017, 2019లో కూడా గెలుపొందారు.

Also Read : స‌మ‌గ్ర‌తకు భంగం క‌లిగితే వేటు త‌ప్ప‌దు

Leave A Reply

Your Email Id will not be published!