Sufi Baba Shot Dead : నాసిక్ లో ‘సూఫీ బాబా’ కాల్చి వేత‌

హ‌త్య‌లో దుండ‌గుల‌ పాత్ర‌పై అనుమానం

Sufi Baba Shot Dead : మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ లో ప్ర‌ముఖుడిగా పేరొందిన ముస్లిం మ‌త గురువు సూఫీ బాబాను(Sufi Baba Shot Dead)  కాల్చి చంపారు. ఈ సూఫీ బాబా అస‌లు పేరు ఖ్వాజా స‌య్య‌ద్ చిస్తీ. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న ఇక్క‌డ మ‌త గురువుగా చెలామ‌ణి అవుతూ వ‌చ్చారు.

సూఫీ బాబా వ‌య‌స్సు 35 ఏళ్లు. ఈ హ‌త్య వెనుక ఎలాంటి మ‌త కోణం అన్న‌ది లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. నాసిక్ జిల్లా లోని యోలా న‌గ‌రంలో ఆధ్యాత్మిక చీఫ్ ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు.

ఆయ‌న స్వస్థ‌లం ఆఫ్గ‌నిస్తాన్ దేశం. అక్క‌డి నుంచి నాసిక్ కు వ‌చ్చారు. మ‌త గురువుగా ఉన్నారు. ఎంఐడీసీ స్థ‌లంలోని ఓపెన్ ప్లాట్ లో రాత్రి స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని నాసిక్ పోలీసులు చెప్పారు.

దుండ‌గులు సూఫీ బాబా నుదుటిపై తుపాకీతో కాల్చి(Sufi Baba Shot Dead)  చంపార‌ని, అత‌డు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడ‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా బాబాను హ‌త్య చేసిన త‌ర్వాత ఆయ‌న ఉప‌యోగిస్తున్న ఎస్ యూవీని స్వాధీనం చేసుకుని అక్క‌డి నుంచి పారి పోయిన‌ట్లు చెప్పారు పోలీసులు.

యోలా పోలీస్ స్టేష‌న్ లో హ‌త్యా నేరం కింద కేసు న‌మోదు చేశామ‌న్నారు. హంత‌కుల కోసం వేట కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైకి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది యోలా ప్రాంతం.

ఈ కాల్చివేత‌లో స‌య్య‌ద్ చిస్తీ డ్రైవ‌ర్ పేరును సాక్ష్యంగా పేర్కొన్నార‌ని పోలీసు చీఫ్ స‌చిన్ పాటిల్ వెల్ల‌డించారు. భూ సంబంధ వ్య‌వ‌హార‌మే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండ వ‌చ్చ‌ని స‌మాచారం.

Also Read : ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పినా ప‌ట్టించు కోలేదు – షిండే

Leave A Reply

Your Email Id will not be published!