Sukesh Chandrasekhar : కేటీఆర్..కవితపై సుకేష్ కామెంట్స్
తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫైర్
Sukesh Chandrasekhar : సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ , కూతురు ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్. ఆయన శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు సుదీర్ఘ లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ తరపు సన్నిహితులు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్స్ కు సంబంధించి ఆధారాలను ఇవ్వాలని అడుగుతున్నారంటూ వాపోయారు. ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదుతో పాటు శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామంటూ తనకు ఆఫర్ ఇచ్చారంటూ ఆరోపించారు సుకేష్ చంద్రశేఖర్.
ఇదిలా ఉండగా సుకేశ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుకేష్(Sukesh Chandrasekhar) ను పోకిరి అంటూ మండిపడ్డారు. తనకు ఆయన ఎవరో తెలియదన్నారు. కావాలని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నరాంటూ ఆరోపించారు.
సుకేష్ చంద్రశేఖర్ ఎవరో, అతడి నేర చరిత్ర ఏమిటో మీడియాకు తెలుసు. తనపై నిరాధార విమర్శలు చేసినప్పుడు మీడియా కూడా తన పరిమితులు ఏమిటో తెలుసుకుని ప్రచురించాలని సూచించారు. ఏది ఏమైనా సుకేష్ చంద్రశేఖర్ ను తాను నమ్మబోనంటూ పేర్కొన్నారు.
Also Read : KTR : సుకేష్ ఆరోపణలు అబద్దం – కేటీఆర్