Sukhbir Singh Badal : ఎగ్జిట్ పోల్స్ ను న‌మ్మం – బాద‌ల్

ఆప్ మేనేజ్ చేస్తోందంటూ ఫైర్

Sukhbir Singh Badal : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ హ‌వా కొన‌సాగుతోందంటూ ముంద‌స్తు ఎన్నిక‌ల స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించాయి. దీనిపై శిరోమ‌ణి అకాలీద‌ళ్ – చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్(Sukhbir Singh Badal) తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఆప్ మేనేజ్ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించ‌కుండా నిషేధం విధించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆప్ ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఆరోపించారు.

ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌య్యే ప్ర‌స్తుత విధానంలో ఇలాంటివి మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ముంద‌స్త‌గా ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు క‌న్ ఫ్యూజ్ కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.

ప్ర‌ధానంగా పంజాబ్ ప్ర‌జ‌లు ఆప్ ను, ఈ కొనుగోలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ను అస్స‌లు న‌మ్మ‌ర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రేపు జరిగే ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో త‌మ పార్టీ అత్య‌ధిక సీట్లు గెలుచుకుంటుంద‌ని చెప్పారు. దీంతో పంజాబ్ లో ఏర్పాటు చేయ‌బోయే ప్ర‌భుత్వంలో తాము కీల‌క పాత్ర పోషిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్.

ఇదిలా ఉండ‌గా అన్ని స‌ర్వే సంస్థ‌లు, ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఆప్ వైపు నిలిచాయి. దీనిపై పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ స్పందించారు. ప్ర‌జ‌లు 10 వ‌ర‌కు ఓపికతో వేచి ఉండాల‌ని సూచించారు.

ఎవ‌రు గెలుస్తార‌నేది ఛాన‌ళ్లు, స‌ర్వే సంస్థ‌లు నిర్ణ‌యించ‌వ‌ని ప్ర‌జ‌లు తీర్పు చెబుతార‌ని అన్నారు. ఇలాంటివి తాము న‌మ్మ బోమంటూ పేర్కొన్నారు.

అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్త‌వానికి దూరంగా ఉన్నాయ‌ని ఉత్త‌రాఖండ్ కాంగ్రెస్ చీఫ్ హ‌రీష్ రావ‌త్ ఆరోపించారు. అయితే ఆప్ సీఎం క్యాండిడేట్ భ‌గ‌వంత్ మాన్ మాత్రం త‌మ‌కు 80 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపాడు.

Also Read : ఎగ్జిట్ పోల్స్ బ‌క్వాస్ – అఖిలేష్

Leave A Reply

Your Email Id will not be published!