Jharkhand CM : పీఎం మోదీకి స‌మ‌న్లు ఇవ్వాలి – సోరేన్

దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించినందుకు

Jharkhand CM : అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారానికి సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు(Jharkhand CM)  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ తాజాగా స‌మ‌న్లు జారీ చేసింది. ఈ మేర‌కు న‌వంబ‌ర్ 3 గురువారం త‌మ వ‌ద్ద‌కు విచార‌ణ కోసం రావాల్సిందిగా స‌మ‌న్ల‌లో పేర్కొంది. దీనిని స‌వాల్ చేస్తూ హేమంత్ సోరేన్ షాకింగ కామెంట్స్ చేశారు.

త‌న‌కు స‌మ‌న్లు ఇవ్వ‌డం కాదు ముందు ఇవ్వాల్సింది దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి అని పేర్కొన్నారు. మాయ మాట‌లు చెప్పి , ప్ర‌జ‌ల‌లో ఓట్లు వేయించుకుని ప‌వ‌ర్ లోకి వచ్చినందుకు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పి మాట నిల‌బెట్టుకోనందుకు.

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌న్ ధ‌న్ ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు జ‌మ చేయ‌నందుకు, కులం, ప్రాంతం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చ‌గొట్టినందుకు. బిల్కిస్ బానో అత్యాచారం, హ‌త్య కేసులో జీవిత ఖైదీల‌ను విడుద‌ల చేయించినందుకు ప్ర‌ధాన మంత్రి మోదీకి(PM Modi) స‌మ‌న్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు హేమంత్ సోరేన్.

అంతే కాదు ఎనిమిదేళ్ల కాలంలో దేశంలోని బీజేపీయేత‌ర 8 రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు పీఎంపై కేసు న‌మోదు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు జార్ఖండ్ సీఎం(Jharkhand CM) . ఇదిలా ఉండ‌గా రేపు ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాంచీలోని ప్రాంతీయ కార్యాల‌యం ముందు హాజ‌రు కావాలంటూ ఈడీ కోరింది.

ఇదిలా ఉండ‌గా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, ఐటీ ల‌ను దుర్వినియోగం చేస్తున్నందుకు మోదీకి స‌మ‌న్లు ఇవ్వాల‌న్నారు హేమంత్ సోరేన్. ఇదిలా ఉండ‌గా సీఎం హేమంత్ సోరేన్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం రేపాయి.

Also Read : యుఎస్ వీసాల ఆల‌స్యంపై ఆందోళ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!