Hanumantha Vahanam : సుందర రాజ స్వామి ఉత్సవాలు
హనుమంత వాహనంపై దర్శనం
Hanumantha Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజ స్వామి వారి అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి సుందర రాజ స్వామి వారు హనుమంత వాహనం(Hanumantha Vahanam)పై భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారిని ఉత్సవాల సమయంలో దర్శించుకుంటే చేసిన తప్పులు తొలగి పోతాయని, ఆయురారోగ్యాలు , సకల సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తిరుచానూరును సందర్శిస్తారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మ వారిని దర్శించుకుంటారు. పక్కనే ఉన్న సుందర రాజ స్వామికి పూజలు చేయడం పరిపాటిగా వస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కృష్ణ స్వామి వారి ముఖ మండపంలో శ్రీ సుందర రాజ స్వామి వారికి వైభవంగా అభిషేకం చేపట్టారు. ఇందులో పాలు , పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో వేడుకగా నిర్వహించారు. ముఖ మండపంలో ఊంజల్ సేవ జరిపారు. హనుమంత వాహన సేవ ఘణంగా జరిగింది. ఇవాళ గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనం ఇస్తారు.
Also Read : Somu Veerraju : బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి సోము