Sunil Kanugolu : ముఖ్య స‌ల‌హాదారుగా సునీల్ క‌నుగోలు

ప్ర‌క‌టించిన సీఎం సిద్ద‌రామ‌య్య‌

Sunil Kanugolu : భార‌త రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందిన సునీల్ క‌నుగోలుకు(Sunil Kanugolu) బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌. గురువారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వానికి, త‌న‌కు ముఖ్య స‌ల‌హాదారుడిగా సునీల్ క‌నుగోలును నియ‌మిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. సాధ్య‌మైనంత వ‌ర‌కు సునీల్ క‌నుగోలు లో ప్రొఫైల్ గా ఉండేందుకు ఇష్ట ప‌డ‌తారు.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ తిరిగి రావ‌డానికి పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేశారు. పూర్తిగా పార్టీ స్ట్రాట‌జీని మార్చేశారు. ఆ పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌చార ప‌రంగా ముందుండి న‌డిపించారు. వెనుక ఉండి చ‌క్రం తిప్పారు. ఒక ర‌కంగా సునీల్ క‌నుగోలు సార‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల ప‌రంగా చూస్తే టాప్ లో ఉండేలా చేశాడు. ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పోటీ ప‌డ‌లేక పోయింది. ఆయ‌న తీసుకు వ‌చ్చిన స్లోగ‌న్స్ బుల్లెట్స్ లాగా పేలాయి.

అప్ప‌టి సీఎం బొమ్మైపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్లోగ‌న్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదే పే సీఎం అని. 40 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌నిదే ప‌ని గ‌డ‌వ‌ద‌న్న ఆరోప‌ణ‌ల‌పై సునీల్ చేసిన ప్ర‌యోగం విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల వెనుక కూడా సునీల్ క‌నుగోలు పాత్ర ఉంద‌న్న‌ది స‌త్యం. మొత్తంగా మ‌నోడికి కేబినెట్ హోదా క‌లిగిన పోస్ట్ ద‌క్క‌డం విశేషం క‌దూ.

Also Read : Kodela Sivaram

 

Leave A Reply

Your Email Id will not be published!