Sunil Kanugolu : సునీల్ కనుగోలుపై రేవంత్ గుస్సా
శశికాంత్ సెంథిల్ కుమార్ కు అప్పగింత
Sunil Kanugolu : ఉచిత కరెంట్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకా రేపుతోంది. అమెరికాలోని తానా వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు కేవలం 3 గంటలే కరెంట్ ఇవ్వాలని అన్నారంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. దీనిపై అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, రాస్తారాకోలు, ర్యాలీలు, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్దం చేసింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా కూడా ఖండించిన దాఖలాలు లేవు. కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులు తప్ప.
Sunil Kanugolu War Room
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్ వార్ రూమ్ కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు సునీల్ కనుగోలు(Sunil Kanugolu). ఆయన సారథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ జోష్ వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో కరెంట్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేరకు కౌంటర్ ఇవ్వడంలో సునీల్ కనుగోలు టీం విఫలమైనట్లు భావించారు టీపీసీసీ చీఫ్. ఆయనపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో మనసు నొచ్చుకున్న సునీల్ కనుగోలు ఉన్నట్టుండి కర్ణాటకకు వెళ్లి పోయారు. ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ కు వార్ రూమ్ హెడ్ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Teegala Krishna Reddy : త్వరలో హస్తం గూటికి ‘తీగల’
