Sunil Kanugolu : కనుగోలు వ్యూహం హస్తం విజయం
Sunil Kanugolu : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ దేశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో వచ్చే శాసన సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టనుంది. కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు. కర్ణాటకలో ఊహించని రీతిలో హస్తానికి అధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రధాన మంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సుడిగాలి పర్యటనలు చేసినా వర్కువుట్ కాలేదు. ఇక తెలంగాణలో ఎలాగైనా సరే పవర్ లోకి తీసుకు రావాలని ప్రయత్నం చేశారు సునీల్ కనుగోలు.
Sunil Kanugolu Strategy
ఆయనను తక్కువ అంచనా వేసింది అధికారంలో కొలువు తీరిన సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ. ప్రచారం చేయడంలో దూసుకు పోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక రేవంత్ రెడ్డి కనిపించే ముఖమైతే కనిపించకుండా చక్రం తిప్పడంలో కనుగోలు ముఖ్య పాత్ర పోషించాడు.
నిన్నటి దాకా ప్రచారం అనే సరికి బీజేపీ, బీఆర్ఎస్ టాప్ లో ఉండేవి. కానీ తెలంగాణలో సీన్ మారింది. ప్రగతి భవన్ లో కారు పంక్చర్ కావడం పక్కా అని, ఇక కమలం వాడి పోనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి వస్తుందని భారీ ఎత్తున ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. గంప గుత్తగా హస్తానికే ఓటు వేశాయి.
అయితే విచిత్రం ఏమిటంటే తామే పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.
Also Read : Kodandaram : ప్రజా తీర్పు సుస్పష్టం – కోదండరాం