Supreme Court Bench : లిస్టింగ్ సిస్టంపై సుప్రీం బెంచ్ అసంతృప్తి
ప్రవేశ పెట్టిన నూతన సీజేఐ యుయు లలిత్
Supreme Court Bench : నూతన జస్టిస్ యుయు లలిత్ తీసుకు వచ్చిన కొత్త లిస్టింగ్ సిస్టమ్ పై సుప్రీంకోర్టు బెంచ్(Supreme Court Bench) అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి వారం సోమ, శుక్ర వారాల్లో 30 మంది న్యాయమూర్తులు ఇద్దరితో కూర్చుని తాజా పీఐఎల్ లతో సహా ఒక్కో బెంచ్ లోని 60కి పైగా ఇతర అంశాలను పరిష్కరించాలని నిర్దేశించారు.
త్వరితగతిన పరిష్కరించడం కోసం సీజేఐ కొత్త జాబితా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న వాటిని ముగించేలా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు.
కొత్త లిస్టింగ్ మెకానిజంను తీసుకు వచ్చారు. అరుదైన సందర్భంలో సుప్రంకోర్టు ధర్మాసనం తన న్యాయపరమైన ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియార్టీలో మూడో నంబర్ జడ్జీగా ఉన్న సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక క్రిమినల్ కేసును విచారించింది.
కొత్త లిస్టింగ్ విధానంలో విచారణకు నిర్ణయించిన అంశాలను చేపట్టేందుకు తగిన సమయం దొరకడం లేదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం నవంబర్ 15న విచారణకు లిస్ట్ చేసింది.
కొత్త విధానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రెండు వేర్వేరు షిప్టులలో పని చేస్తున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో ముగ్గురు న్యాయమూర్తులతో కూర్చుంటారు.
ఉదయం సెషన్ లో సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న పాత కేసులను మధ్యాహ్నం 1 గంటల వరకు విచారించాలని కొత్త లిస్టింగ్ విధానం స్పష్టం చేసింది.
ఆ తర్వాత 30 కేసులను సాయంత్రం 4 గంటల వరకు విచారిస్తారు. సీజేఐ కొలువు తీరాక 13 పని దినాఆలో 3,500కు పైగా ఇతర విషయాలను, 250కి పైగా సాధారణ విచారణ విషయాలను , 1,200కి పైగా పిటిషన్లను పరిష్కరించింది.
Also Read : డీకే శివకుమార్ కు ఈడీ సమన్లు