Rahul Gandhi Case : రాహుల్ కేసు ఆగస్టు 4కు వాయిదా
మోదీపై అనుచిత వ్యాఖ్యలపై కేసు
Rahul Gandhi Case : పరువు నష్టం కేసులో తనకు గుజరాత్ హైకోర్టు స్టే ఇవ్వక పోవడాన్ని సవాల్ చేస్తూ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉండగా 2019లో కోలార్ లో జరిగిన బహిరంగలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీల గురించి ప్రస్తావించారు. ఆపై ఆర్థిక నేరస్థులంతా దేశం విడిచి పోయారని , వారంతా మోదీ వారసులేనంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Rahul Gandhi Case Supreme Court
దీనిని సవాల్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా ఉన్న పూర్ణేష్ మోదీ రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి సూరత్ కోర్టు విచారించింది. దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఇలా ఆధారాలు లేకుండా ఎలా కామెంట్స్ చేస్తారంటూ 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది కింది కోర్టు.
దీనిని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనంటూ పేర్కొంది. ఇదే సమయంలో దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ మంత్రికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
Also Read : Bhagyalaxmi Temple : భాగ్యలక్ష్మి దర్శనం శుభప్రదం