DK Aruna : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు డీకే అరుణకు వ్యతిరేకంగా స్టే ఇచ్చింది.
DK Aruna Issue Viral
డీకే అరుణను(DK Aruna) ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికలు జరిగేందుకు రాష్ట్రంలో ఇంకా రెండు నెలలే ఉంది. ఇంతలో తన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పడం సబబు కాదంటూ కోర్టు మెట్లు ఎక్కారు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.
దీంతో సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. చివరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయొద్దంటూ సుప్రీం స్టే జారీ చేసింది. దీంతో యధావిధిగా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వీలు కల్పించింది ఈ స్టే.
విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. ఈకేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనం కలిగించింది.
Also Read : Ram Gopal Varma : పవన్ కళ్యాణ్ కు 9 ప్రశ్నలు