Sidhu : టైం కావాలన్న సిద్దూ కుదరదన్న కోర్టు
వెంటనే లొంగి పోవాల్సిందేనంటూ స్పష్టం
Sidhu : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు మరోసారి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. 1988లో జరిగిన రోడ్డు ఘటన కేసులో కోర్టు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ(Sidhu).
ఇవాళ పాటియాలా కోర్టుకు హాజరవుతారని, పార్టీ మద్దతుదారులంతా తరలి రావాలని జిల్లా పార్టీ చీఫ్ కోరారు. ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో సంజాయిషీ కోరాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కోర్టు.
ఆరోగ్య కారణాల రీత్యా తను లొంగి పోయేందుకు మరికొంత గడువు (సమయం) కావాలని కోరుతూ సిద్దూ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు నిర్ద్వందంగా తోసి పుచ్చింది.
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. సెలెబ్రిటీలు, ప్లేయర్లు, పొలిటికల్ లీడర్లకు ఎలాంటి అదనపు హక్కులు, మినహాయింపులు అంటూ ఉండవని స్పష్టం చేసింది.
ఒక రకంగా సిద్దూకు మొట్టికాయలు వేసింది. కాగా పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ దావాను అత్యవసరంగా విచారించడం కుదరని కుండ బద్దలు కొట్టింది సుప్రీంకోర్టు.
దీంతో ఈ పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళో రేపో లొంగి పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 1988 నాటి కేసులో కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
కోర్టు తీర్పు శిరసా వహిస్తానని, పోలీసులకు లొంగి పోతానని స్పష్టం చేశారు సిద్దూ(Sidhu). సిద్దూ నివాసం వద్ద కోలాహలం నెలకొంది.
Also Read : జ్ఞాన్ వాపి సర్వే కేసుపై సుప్రీం కామెంట్స్