Supreme Court : జగన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
బెయిల్ రద్దుపై నోటీసులు జారీ
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దుపై నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇదిలా ఉండగా తన కేసును వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్ ను విచారించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Supreme Court Notice
అక్రమ ఆస్తుల కేసులో సీఎం జగన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంలో(Supreme Court) వైసీపీ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అంతకు ముందు రఘురామ పిటిషన్ ను గత ఏడాది 2022 అక్టోబర్ 28న కొట్టి వేసింది తెలంగాణ హైకోర్టు. కాగా అక్రమాస్తుల కేసులో గత 10 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నారు జగన్ రెడ్డి. ఇదే క్రమంలో ఎంపీ రఘురామను అరెస్ట్ చేసింది. ఆయన సైతం బెయిల్ పై ఉన్నారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా జారీ చేసిన ఆదేశాలతో జగన్ రెడ్డి ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు ఎంపీ రఘురామ రాజు. దీని ఆధారంగా కోర్టు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
Also Read : AP CID : బాబుపై సీఐడీ అఫిడవిట్ దాఖలు