Supreme Court Collegium : సుప్రీంకోర్టు కొలీజియం కీలక భేటీ
కొత జడ్జీల ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం
Supreme Court Collegium : దేశ న్యాయ వ్యవస్థలో కీలకమైన న్యాయమూర్తుల ఎంపిక విషయంపై భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కీలకమైన కొలీజియం భేటీ జరిగింది. కాగా జడ్జీల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ఎప్పుడైనా కొలీజియం(Supreme Court Collegium) కొన్ని నిమిషాల పాటు మాత్రమే కొనసాగుతుంది. కానీ ఈసారి 75 నిమిషాల పాటు జరగడం విశేషం. సుప్రీంకోర్టు సాధారణంగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది.
న్యాయమూర్తులు వచ్చేంత వరకు న్యాయవాదులు వేచి ఉంటారు. కానీ ఉదయం 11.15 గంటలకు మాత్రమే కోర్టు నెంబర్ 1 నుండి 5 వరకు న్యాయమూర్తులు తమ బెంచ్ లకు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా ఆగస్టు 26న భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన ఏపీకి చెందిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పదవీ విరమణ చేయనున్నారు.
సుదీర్ఘంగా సమావేశం జరిగినప్పటికీ సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తల నియామకం, హైకోర్టులకు సంబంధించి జడ్జీల నియామకం లేదా
బదిలీపై ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ఇదిలా ఉండగా కొలీజియంలో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ , జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీవై చంద్ర చూడ్ , జస్టిస్
ఎస్. కె. కౌల్ , జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.
కాగా ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు ఇటీవల పదవీ విరమణ చేశారు. జస్టిస్ వినీత్ శఱణ్ , జస్టిస్ ఎల్. ఎన్. రావు, జస్టిస్ ఏం.ఎం. ఖాన్విల్కర్
స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జనలు జరిగాయి.
అయితే భారత దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ పేరును సిఫారసు చేయాలని కోరుతూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ
చీఫ్ జస్టిస్ రమణకు లేఖ రాసింది.
జస్టిస్ లలిత్ ఆగస్గు 27న భారత దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరనున్నారు. ఆయన పదవీ కాలం 74 రోజులు మాత్రమే ఉంటుంది.
Also Read : అనాలోచిత నిర్ణయాల వల్లే కష్టాలు – రాజన్