Gujarat Riots Modi : గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్

అప్పీలును కొట్టేసిన సుప్రీంకోర్టు

Gujarat Riots Modi : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన గుజ‌రాత్ అల్ల‌ర్ల మార‌ణ‌కాండ కేసులో భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి(Gujarat Riots Modi) క్లీన్ చిట్ ల‌భించింది.

ఆనాటి ఘ‌ట‌న‌ల‌కు అప్ప‌టి గుజ‌రాత్ సీఎంగా ఉన్న న‌రేంద్ర మోదీ కార‌ణ‌మంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. గుల్బ‌ర్గ్ సొసైటీ మార‌ణ‌కాండ‌లో మ‌ర‌ణించిన 68 మందిలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జ‌కియా జాఫ్రీ ఈ పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు.

2002లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆమె చేసిన అప్పీలు అర్హ‌త లేనిదిగా శుక్ర‌వారం సుప్రీంకోర్టు పేర్కొంది. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం జారీ చేసిన క్లియ‌రెన్స్ ను స‌మ‌ర్థిస్తూ ఈ తీర్పు వెలువ‌రించింది.

ఒక రోజు కింద‌ట గోద్రాలో యాత్రికుల‌ను తీసుకు వెళుతున్న రైలు కోచ్ ను త‌గుల‌బెట్టి 59 మందిని చంపిన త‌ర్వాత మొద‌లైన అల్ల‌ర్ల‌లో ఇది అత్యంత దారుణ‌మైన హింసాత్మ‌క సంఘ‌ట‌న‌.

84 ఏళ్ల జాఫ్రీ మ‌త ప‌ర‌మైన అల్ల‌ర్ల‌పై తాజాగా ద‌ర్యాప్తు చేయాల‌ని కోరింది సుప్రీంకోర్టును. రాజ‌కీయ నాయ‌కులు, పోల‌సుల ప్ర‌మేయం ఉందంటూ ఆరోపించింది.

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు ఏఎం ఖాన్విల్క‌ర్ , దినేష్ మ‌హేశ్వ‌రి , సీటీ ర‌వికుమార్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో తీర్పును రిజ‌ర్వ్ చేశారు.

అహ్మ‌దాబాద్ లోని గుల్ బ‌ర్గ్ సొసైటీలో జ‌రిగిన ఊచ‌కోత సంచ‌ల‌నం సృష్టించింది. 29 బంగ్లాలు, 10 అపార్ట్ మెంట్ భ‌వ‌నాల స‌మూహంలో ముస్లింలు ఎక్కువ‌గా నివ‌స్తిస్తున్నారు.

సుప్రీంకోర్టు నియ‌మించిన సిట్ తిరిగి విచారించిన 10 ప్ర‌ధాన గుజ‌రాత్ అల్ల‌ర్ల(Gujarat Riots Modi) కేసులలో ఇది ఒక‌టి. ఆనాడు 68 మందిని బ‌య‌ట‌కు లాగారు. కొట్టారు. కాల్చి వేశారు. సాయం కోసం కోరినా పోలీసులు ప‌ల‌క‌లేద‌ని జాఫ్రి ఆరోపించారు.

Also Read : స‌మ‌గ్ర‌త ముఖ్యం సార్వ‌భౌమ‌త్వం అవ‌స‌రం

1 Comment
  1. Sathyanarayana says

    ఎలుకను కూడా పట్టలేదు కొండను తవ్వారు…

Leave A Reply

Your Email Id will not be published!