Suprme Court Dismisses : ‘చంద్రచూడ్’ పై పిటిషన్ కొట్టివేత
సీజేఐగా నియమించడంపై అభ్యంతరం
Suprme Court Dismisses : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్(Suprme Court Dismisses). నవంబర్ 8న ఆయన సీజేఐగా అత్యున్నత పదవిని స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దావాను కొట్టి వేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ ను ఎలా నియమిస్తారంటూ, ఆయనకు సీజేఐ అర్హత లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ఆ వెంటనే సంచలన వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ కు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్ ను స్వీకరించేందుకు మాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు.
మొత్తం అభ్యర్థన పూర్తిగా తప్పుగా భావిస్తున్నామని, అందుకే దావాను పూర్తిగా కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది ధర్మాసనం. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యూయూ లలిత్ , న్యాయమూర్తులు ఎస్ రవంద్ర భట్, బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్ దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసినట్లుగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు సీజేఐ లలిత్ ముందు అత్యవసరంగా లిస్టింగ్ కోసం ఈ అంశాన్ని ప్రస్తావించారు. జస్టిస్ చంద్రచూడ్ ను సీజేఐగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది ముర్సలిన్ అసిజిత్ షేక్ పిటిషన్ దాఖలు చేశారు.
పెద్ద బెంచ్ ల కట్టుబాట్లు ధిక్కరించారని , అర్హులైన న్యాయవాదులకు న్యాయాన్ని నిరాకరించారంటూ ఆరోపించారు.
Also Read : రాజస్థాన్ లో అనిశ్చితికి తెర దించాలి