Supreme Court : కోవిడ్ -19 వ్యాక్సినేషన్ పై సంచలన కామెంట్స్ చేసింది భారతదేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court). వ్యాక్సిన్ ఆదేశాల ద్వారా వ్యక్తులపై విధించిన పరిమితులను దామాషా ప్రకారంగా పిలువలేమని కోర్టు పేర్కొంది.
వ్యాక్సిన్ లను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court)విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వ్యాక్సిన్ తీసుకోమని ఎవరినీ బలవంతం చేయలేమని, టీకా ప్రతికూల ప్రభావాలపై నివేదికలను ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు భారత దేశ కోవిడ్ వ్యాక్సిన్ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది.
శారీరక సమగ్రత చట్టం ప్రకారం రక్షించబడింది. ఎవరినీ బలవంతంగా టీకాలు వేయకూడదు స్పష్టం చేసింది. సమాజ ఆరోగ్యం దృష్ట్యా వ్యక్తిగత హక్కులపై కొన్ని పరిమితులు విధించ వచ్చని కోర్టు సూచించింది.
కేసులు తక్కువగా ఉన్నట్లయితే బహిరంగ ప్రదేశాలు, సేవలు, వనరులను యాక్సెస్ చేయడంలో టీకాలు వేయని వ్యక్తులపై ఎలాంటి అడ్డంకులు అంటూ ఉండవని సుప్రీంకోర్టు పేర్కొంది.
వ్యాక్సిన్ ఆదేశాల ద్వారా వ్యక్తులపై విధించిన ఆంక్షలు అంటూ ఉండ కూడదని కోర్టు తీర్పు చెప్పింది. ఇన్ఫెక్షన్ సంఖ్య తక్కువగా ఉన్నంత వరకు పబ్లిక్ స్థలాలు,
సేవలు, వనరులను యాక్సెస్ చేయడంపై వ్యక్తులకు ఎటువంటి పరిమితి విధించ కూడదని వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూరర్తులు ఎల్. ఎన్. రావు, బి.ఆర్. గవాయ్ తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజలు, వైద్యుల నుండి వ్యాక్సిన్ ల ప్రతికూల ఘటనలపై నివేదికలను , వివరాలను రాజీ పడకుండా ప్రచురాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
Also Read : కుదుపునకు లోనైన స్పైస్ జెట్ ఫ్లైట్