Azam Khan Bail : ఆజం ఖాన్ కు మ‌ధ్యంత‌ర బెయిల్

మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Azam Khan Bail : యూపీకి స‌మాజ్ వాది పార్టీ నాయ‌కుడు ఆజం ఖాన్ కు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్నారు.

2020 నుండి జైలులో ఉన్నాడు. త‌న ముందు స‌మ‌ర్పించిన అసాధార‌ణ వాస్త‌వాల‌ను ఉటంకిస్తూ చీటింగ్ కేసులో ఆజం ఖాన్(Azam Khan Bail) కు

కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా ఆజం ఖాన్(Azam Khan Bail)  సాధార‌ణ బెయిల్ పిటిష‌న్ పై నిర్ణయం తీసుకునేంత వ‌ర‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ కొన‌సాగుతుంద‌ని

స్ప‌ష్టం చేసింది కోర్టు. దీంతో ఆయ‌న విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మం అవుతుంది.

ఆజం ఖాన్ పై ప‌లు ఆరోప‌ణ‌లు, అభియోగాలు ఉన్నాయి. రాంపూర్ ప‌బ్లిక్ స్కూల్ కు సంబంధించిన భూ క‌బ్జా, ఫోర్జ‌రీకి సంబంధించిన కేసేఉ, పాఠ‌శాల‌కు గుర్తింపు ఇచ్చేందుకు బిల్డింగ్ స‌ర్టిఫికెట్ల‌ను ఫోర్జ‌రీ చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ప్రధాన న్యాయ‌మూర్తులు ఎల్.ఎన్.రావు, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్, ఏఎస్ బోప‌న్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆజం ఖాన్ దాఖ‌లు చేసిన రిట్ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది.

అల‌హాబాద్ హైకోర్టు ద్వారా ఖాన్ బెయిల్ ద‌ర‌ఖాస్తును ప‌రిష్క‌రించ‌డంలో జాప్యం గురించి బెంచ్ గ‌తంలో ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ కేసును కోర్టు మంగ‌ళ‌వారం త‌న తీర్పును రిజ‌ర్వు చేసింది.

ఈ కేసులో ద‌ర్యాప్తు అధికారుల‌ను ఆజం ఖాన్ బెదిరించార‌ని యూపీ ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. వాంగ్మూలం న‌మోదు చేస్తున్న స‌మ‌యంలో

త‌మ‌కు వార్నింగ్ ఇచ్చాడంటూ పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఆజం ఖాన్ గ‌త రెండేళ్లుగా జైలులో ఉన్నార‌ని, ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లి ఎలా బెదిరిస్తాడని కోర్టుకు విన్న‌వించారు ఖాన్ త‌ర‌పు

న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్.

2022 రాంపూర్ నుండి జైలు నుంచే పోటీ చేసి గెలుపొందారు ఖాన్. కాగా ఖాన్ కు బీఎస్పీ చీఫ్ మాయావ‌తి మ‌ద్ద‌తు తెలిపారు. ఇదిలా ఉండ‌గా

ఆజం ఖాన్ పై 89 కేసులు ఉన్నాయి. 88 కేసుల్లో బెయిల్ దొరికింది.

Also Read : శ‌శి థ‌రూర్ కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!