Supreme Court : హిండెన్ బర్గ్ కేసు సెబీకి గడువు
జూలై 11న నిపుణుల ప్యానెల్ నివేదిక
Supreme Court : హిండెన్ బర్గ్ కేసుకు సంబంధించి జూలై 11న నిపుణుల ప్యానెల్ నివేదికపై విచారణకు సెబీకి మరింత సమయం లభించింది. ఆగస్టు 14 లోగా దర్యాప్తునకు సంబంధించి నివేదికను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ ఆదేశించారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మరో మూడు నెలల గడువు ఇచ్చింది. ఇదిలా ఉండగా హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది గౌతమ్ అదానీ కంపెనీకి సంబంధించి. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఈ తరుణంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ఆరు నెలలు గడువు కోరింది. దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయవాది తుషార్ మెహతా కోరినట్లుగా రెగ్యులేటర్ కు మరింత సమయం ఇవ్వాలా వద్దా అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆగస్టు 14 లోగా తన నివేదికను సమర్పించాలని సెబీని ఆదేశించారు సీజేఐ ధనంజయ చంద్రచూడ్.
నిరవధిక పొడిగింపునకు ఇచ్చేందుకు కుదరదని స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తమకు తెలియ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వగలమని పేర్కొన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందో తమకు తెలియ చేయాలని ఆదేశించారు సీజేఐ ధనంజయ చంద్రచూడ్.
Also Read : Siddaramaiah