Satyendar Jain Bail : సత్యేందర్ జైన్ కు మధ్యంతర బెయిల్
అనారోగ్య కారణాల కారణంగా తీర్పు
Satyendar Jain Bail : మనీ లాండరింగ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు ఊరట లభించింది(Satyendra Jain). ఆయనపై ఈడీ, సీబీఐ కేసు నమోదు చేసింది. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో ఆందోళన నెలకొంది. దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. సత్యేందర్ జైన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారని, ఆయనపై చేయి కూడా చేసుకున్నారంటూ మండిపడింది. అందుకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా సత్యేందర్ జైన్(Satyendra Jain) ఉన్నట్టుండి గురువారం బాత్రూంలో పడి పోయారు. దీంతో ఆయనను హుటా హుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లారు జైలు అధికారులు. ఆయనకు మెరుగైన చికిత్స అందజేశారు. సత్యేందర్ జైన్ ను అత్యవసర చికిత్స కోసం ఐసీయూలో ఉంచారు. ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆయన ఆరోగ్యం బాగా లేదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని న్యాయమూర్తికి విన్నవించారు. బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. మెడికల్ గ్రౌండ్ ప్రాతిపదికన మాజీ మంత్రికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు జడ్జి. దీంతో కొంత ఊరట లభించినట్లయింది.
Also Read : PM Modi Govt Failure