Maharastra Crisis : ‘మరాఠా’పై విచారించనున్న సుప్రీంకోర్టు
ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఉత్కంఠ
Maharastra Crisis : మహారాష్ట్రలో (Maharastra Crisis) మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసి కొలువు తీరిన శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ సంకీర్ణ సర్కార్ కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
అయినా బేఖాతర్ చేస్తూ ముందుకు వెళుతున్నారు షిండే. తాజాగా తమ పార్టీపై గెలిచి ధిక్కార స్వరం వినిపించిన వారిపై వేటు వేయాలంటూ ఇప్పటికే శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇదే సమయంలో తమపై వేటు వేయడాన్ని నిరసిస్తూ రెబల్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 12 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సర్వోన్నత న్యాయ స్థానం.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పై కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ఉప సభాపతి స్థానంలో ఉన్న వారు జడ్జిగా ఫీల్ అయితే ఎలా అని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించి నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించడంతో రెబల్ ఎమ్మెల్యేలు కోర్టుకు తమ అఫిడవిట్ ను సమర్పించారు.
ఇదే సమయంలో ఫిరాయింపులకు ప్రతిఫలంగా తమ నాయకుడికి సీఎం పదవిని ఇవ్వడం కంటే మెరుగైన మార్గం లేదంటూ ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ చీఫ్ విప్ ఉనీల్ ప్రభు సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరారు. ఇరు పక్షాలకు చెందిన వారు అఫిడవిట్లను సమర్పించారు కోర్టులో.
జూన్ 27న అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా షిండే క్యాంప్ దాఖలు చేసిన పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
Also Read : షిండేపై శివమెత్తిన ఆదిత్యా ఠాక్రే