Supreme Court : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టాయి విపక్షాలు, రైతులు.
ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో. ఈ దావాకు సంబంధించి ఈనెల 11న విచారణ జరపనుంది.
ఈ విషయాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) అంగీకారం తెలిపింది. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్ 3న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య టూర్ ను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేపట్టారు.
వారిపై ఆశిష్ మిశ్రా ఆధ్వర్యంలో రైతులపై కారు దూసుకు వెళ్లేలా చేశాడు. ఈ ఘటనలో రైతులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి.
పార్లమెంట్ సమావేశాలు స్తంభించేలా చేశాయి. రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సీరియస్ అయ్యారు.
మనుషుల్ని, రైతులను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా బయటకు విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు. సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం నిలదీశారు.
కానీ కేంద్రం పట్టించు కోలేదు. దీంతో విచారణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ లభించ లేదని, కానీ ఆశిష్ మిశ్రాకు ఎలా బెయిల్ వచ్చిందంటూ ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి విన్నవించారు.
Also Read : యూపీలో కాషాయం ఖతం