Nupur Sharma : నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు సీరియస్
అధికారం ఉంది కదా అని మాట్లాడతారా
Nupur Sharma : ప్రవక్త మహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై(Nupur Sharma) సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తనకు ప్రాణ భయం ఉందని, తనపై దేశంలోని వివిధ ప్రాంతాలలో నమోదైన ఎఫ్ఐఆర్ లకు సంబంధించిన కేసులన్నీ ఢిల్లీ పరిధిలో ఉండేలా చూడాలంటూ నూపుర్ శర్మ కోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు వెనుకా ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడమని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు.
ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని నూపుర్ శర్మ లాయర్ వాదించగా మాట్లాడే ముందు ఇలా జరుగతుందని ఆలోచించ లేదా అని నిలదీశారు. అధికారం ఉంది కదా అనే గర్వంతోనే ఇలా కామెంట్స్ చేసిందంటూ పేర్కొన్నారు.
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ దేశం తగులబడే స్థితికి చేరుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరో వైపు తను ఇలా కామెంట్స్ చేస్తూనే లాయర్ నని చెప్పుకోవడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు జస్టిస్ సూర్యకాంత్. ఆమె బేషరత్తుగా దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు .
ఇదే సమయంలో ఢిల్లీ పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి. మరి ఇన్ని రోజుల దాకా ఎందుకు ఆలస్యం వహించారని ప్రశ్నించారు.
మొత్తంగా చూస్తే మొండితనం, అహంకారం నూపుర్ శర్మ(Nupur Sharma) లో కనిపించిందంటూ జస్టిస్ సూర్యకాంత్ నిప్పులు చెరిగారు.
Also Read : నూపుర్ శర్మ దేశానికి క్షమాపణ చెప్పాలి