Supreme Court : ఈడీపై సుప్రీంకోర్టు కీల‌క‌ కామెంట్స్

భ‌యాందోళ‌న‌లు సృష్టించ‌వ‌ద్దు

Supreme Court : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)ని టార్గెట్ చేసింది. ఈ మేర‌కు భ‌యంతో కూడిన వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌వ‌ద్ద‌ని ఆదేశించింది. ఎక్సైజ్ అధికారిలో భ‌యాందోళ‌న వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌వ‌ద్ద‌ని కోర్టు ఈడీని సూచించింది. అనుచిత ప్ర‌వ‌ర్త‌న ఉండ కూడ‌ద‌ని పేర్కొంది.

ప‌లువురు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు బెదిరింపుల‌కు గుర‌వుతున్న‌ట్లు ఫిర్యాదు చేశార‌ని , సీఎం భూపేష్ బ‌ఘేల్ ను ఇరికించార‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. మ‌ద్యం అక్ర‌మాల కేసులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ సంద‌ర్బంగా జ‌స్టిస్ లు ఎస్కే కౌల్ , జ‌స్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ వ్యాఖ్య‌లు చేసింది.

ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో వాదించారు. త‌మ‌పై ఈడీ ద‌ర్యాప్తును స‌వాల్ చేస్తూ కొంద‌రు వ్య‌క్తులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై ఇంప్లీడ్ కోసం ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసింది. 2019 నుండి 2022 మ‌ధ్య కాలంలో అనేక విధాలుగా అవినీతి జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై ఈడీ విచార‌ణ జ‌రుపుతోంది.

ఇదిలా ఉండ‌గా స‌ర్వోన్న‌త న్యాయ స్థానం చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపుతున్నాయి. తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌పై చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఇటీవ‌ల విప‌క్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నాయి.

Also Read : Mohisin Khan

Leave A Reply

Your Email Id will not be published!