Supreme Court Notes Ban : నోట్ల ర‌ద్దుపై ‘సుప్రీం’ కీల‌క తీర్పు

దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌

Supreme Court Notes Ban : ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం 2016లో అనూహ్యంగా ముంద‌స్తు అనుమ‌తి లేకుండానే నోట్ల‌ను ర‌ద్దు చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కునారిల్లి పోయింది. తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. నోట్ల ర‌ద్దు కార‌ణంగా కోట్లాది మంది రోడ్ల పాల‌య్యారు. మోదీ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో(Supreme Court Notes Ban) పెద్ద ఎత్తున పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. జ‌న‌వ‌రి 2న సోమ‌వారం సుప్రీంకోర్టు

ఏం తీర్పు చెబుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది దేశ‌ వ్యాప్తంగా. కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో త‌మ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంది కేంద్ర స‌ర్కార్. పెద్ద నోట్ల ర‌ద్దు అనేది ముంద‌స్తుగా ఆలోచించి తీసుకున్నదేన‌ని స్ప‌ష్టం చేసింది. న‌కిలీ డ‌బ్బు, ఉగ్ర‌వాదుల‌కు ఫైనాన్సింగ్ , న‌ల్ల‌ధ‌నం, ప‌న్ను ఎగ‌వేత‌దారుల నుంచి ఎదుర్కొనేందుకు నోట్ల‌ను ర‌ద్దు చేశామ‌ని తెలిపింది కోర్టుకు. ఇదిలా ఉండ‌గా నోట్లు ర‌ద్దు అనేది ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌ని ప్ర‌తిపక్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

ఇక నోట్ల ర‌ద్దులో భాగంగా రూ. 1,000, రూ. 500 క‌రెన్సీ నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ 2016 న‌వంబ‌ర్ లో కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఒక్క నిర్ణ‌యం వ‌ల్ల రాత్రికి రాత్రే రూ. 10 ల‌క్ష‌ల కోట్లు చెలామ‌ణిలో లేకుండా పోయాయి. నోట్ల ర‌ద్దును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో(Supreme Court Notes Ban) 58 పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఇది స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని దానిని కోర్టు కొట్టి వేయాల‌ని వాదించారు.

ఎలాంటి స్ప‌ష్ట‌మైన ఉప‌శ‌మ‌నం ల‌భించ‌న్పుడు కోర్టు నిర్ణ‌యం తీసుకోద‌ని స‌ర్కార్ వాదించిది. జ‌స్టిస్ ఎస్. ఏ. న‌జీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం శీతాకాల విరామానికి ముందు వాద‌న‌లు విన్న‌ది. డిసెంబ‌ర్ 7న తీర్పును నిలిపి వేసింది.

Also Read : సుప్రీం తీర్పు నివేదిక‌లు ఇక ఫ్రీ

Leave A Reply

Your Email Id will not be published!