Supreme Court : నూపుర్ శ‌ర్మ దేశానికి క్ష‌మాప‌ణ చెప్పాలి

బీజేపీ బ‌హిష్కృత నేత‌పై సుప్రీంకోర్టు ఫైర్

Supreme Court : ప్ర‌వ‌క్త మ‌హ‌మూద్ పై చేసిన వ్యాఖ్య‌ల‌తో క‌ల‌క‌లం రేపిన నూపుర్ శ‌ర్మ‌పై భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సీరియ‌స్ అయ్యింది.

ఆమెను భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి స‌స్పెండ్ చేసినా ఈరోజు వ‌ర‌కు ఎందుకు క్ష‌మాప‌ణ చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించింది. బేష‌ర‌తుగా ఆమె వివ‌ర‌ణ ఇవ్వాల్సిందేన‌ని పేర్కొంది.

ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది ధ‌ర్మాస‌నం దేశానికి నిప్పు పెట్టండి అంటూ. ఇదిలా ఉండ‌గా బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన బీజేపీ నేత నూపుర్ శ‌ర్మ త‌న‌పై న‌మోదైన అన్ని ఎఫ్ఐఆర్ ల‌ను ఢిల్లీకి బ‌దిలీ చేయాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది నూపుర్ శ‌ర్మ‌పై. ఈ దేశాన్ని అగ్నికి ఆహుతి చేయండి అంటూ వ్యాఖ్యానించింది. నూపుర్ శ‌ర్మ మొత్తానికి క్షమాప‌ణ చెప్పాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది.

ఇందుకు పూర్తిగా ఆమె బాధ్య‌త వ‌హించాల్సిందేనంటూ పేర్కొంది. ఆమె ఎలా మాట్లాడిందో చూశాం. నూపుర్ శ‌ర్మ మాట్లాడిన విధానం చాలా అభ్యంత‌ర‌క‌రంగా ఉందంటూ కోర్టు తెలిపింది.

అంతే కాకుండా ఆమె తాను ఒక లాయ‌ర్ న‌ని చెప్ప‌డం సిగ్గుచేటు అంటూ మండిప‌డింది. ఆ ఒక్క స‌మూహానికే కాదు దేశం మొత్తానికి క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని సుప్రీంకోర్టు(Supreme Court) జ‌స్టిస్ సూర్య‌కాంత్ అన్నారు.

దేశ వ్యాప్తంగా భావోద్వేగాల‌ను ర‌గిల్చిన తీరు దారుణంగా ఉంద‌న్నారు. ఆమె కామెంట్స్ అహంకార పూరితంగా ఉన్నాయ‌న్నారు. త‌న‌కు అధికారం ఉంది క‌దా అని దేశ చ‌ట్టాన్ని గౌర‌వించ‌కుండా ఏదైనా ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఎలా భావిస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

Also Read : ఉద్ద‌వ్ ఠాక్రేకు ఏక్ నాథ్ షిండే షాక్

Leave A Reply

Your Email Id will not be published!