Hijab Row Supreme Court : హిజాబ్ వివాదం భిన్నాభిప్రాయం

సుప్రీంకోర్టులో విచిత్ర‌క‌ర ప‌రిస్థితి

Hijab Row Supreme Court :  దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన క‌ర్ణాట‌క హిజాబ్ వివాదంపై భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా మొద‌టిసారిగా ఇటీవ‌ల భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ముస్లిం విద్యార్థినులు కాలేజీల్లో హిజాబ్(Hijab Row) ను ధ‌రించ రాదంటూ క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది.

బ‌డులు, కాలేజీలు లేదా విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకునే వారు ఎవ‌రైనా స‌రే ప్ర‌భుత్వం నిర్దేశించిన నియ‌మాలు పాటించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ఇందుకు ఎవ‌రి మ‌త విశ్వాసాలు వారివేన‌ని కానీ చ‌దువు వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అంద‌రికీ ఒక్క‌టేనంటూ పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

క‌ర్ణాట‌క సర్కార్ ఇచ్చిన రూల్స్ తాము పాటించ బోమంటూ కొంద‌రు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై గురువారం సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిగింది. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు భిన్నాభిప్రాయాలు వినిపించారు. ధ‌ర్మాస‌నంలోని ఇద్ద‌రు జ‌డ్జీలు వేర్వేరు అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇందులో భాగంగా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం జారీ చేసిన హిజాబ్ నిషేధ ఆదేశాల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు పేర్కొన్నారు న్యాయ‌మూర్తి హేమంత్ గుప్తా. మ‌రో న్యాయ‌మూర్తి సుధాన్షు దులియా మాత్ర‌మ ప్ర‌భుత్వ ఆదేశాలను కొట్టి పారేశారు. ఈ కేసులో భిన్నాభిప్రాయం ఉంద‌ని అందుకే అప్పీల్ ను డిస్మిస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు గుప్తా. అమ్మాయిల‌కు విద్య‌ను అందించ‌డ‌మే  ముఖ్య‌మ‌న్నారు.

నిషేధం వ‌ల్ల అమ్మాయిల బ‌తుకులు బాగు ప‌డ‌తాయా అని ప్ర‌శ్నించారు. ఈ కేసును సీజేఐ ముందుకు తీసుకు వెళుతున్నామ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

Also Read : ల‌క్ష్మ‌ణ రేఖ ఏమిటో మాకు తెలుసు

Leave A Reply

Your Email Id will not be published!