Supreme Court : అరెస్ట్ శిక్షార్హమైన సాధనం కాదు – సుప్రీం కోర్టు
ఆరోపణల ఆధారంగా శిక్షించకూడదు
Supreme Court : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. అరెస్ట్ కి సంబంధించిన అంశంపై ప్రధానంగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అరెస్ట్ అన్నది శిక్షార్హమైన సాధనం కాదని స్పష్టం చేసింది . ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
కేవలం ఆరోపణల ఆధారంగా వ్యక్తులను శిక్షించ రాదని కుండ బద్దలు కొట్టింది. న్యాయ పరమైన విచారణ లేకుండానే శిక్షించాలని అనుకోవడం పద్దతి కాదని సూచించింది.
ఇదిలా ఉండగా మతపరమైన భావనలు రెచ్చ గొట్టాడని గత జూన్ 27న మహ్మద్ జుబైర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ ప్రాంతాలలో 7 కేసులు నమోదయ్యాయి.
జూలై 20న బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాయకుండా ఎవరినీ ఆపలేమని, మాట్లాడే, రాసే హక్కు రాజ్యాంగం కల్పించిందని దానిని అడ్డుకోకూడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది.
నేర ప్రక్రియ దుర్మార్గపు చక్రంలో జుబైర్ ఇరుక్కు పోయాడు. ఇక్కడ ప్రక్రియే శిక్షగా మారిందని కోర్టు హెచ్చరించింది.
తొందరగా , విచక్షణా రహితంఆ అరెస్టులు చేయడం, బెయిల్ పొందడంలో ఇబ్బంది, అండర్ ట్రయల్ ని సుదీర్ఘంగా జైలులో ఉంచడం వంటి విషయాలను సీజేఐ ఎన్వీ రమణ లేవనెత్తారు.
ఒక నెల జైలు జీవితం తర్వాత జుబైర్ బయటకు వచ్చాడు. అరెస్ట్ అనేది శిక్షార్హమైన సాధనంగా ఉపయోగించ బడదు.
ఎందుకంటే ఇది క్రిమినల్ చట్టం నుండి వెలువడే అత్యంత తీవ్రమైన పరిణామాలలో ఒకటి. వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడమని సీజే డీవై చంద్రచూడ్ , ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read : ప్రశ్నిస్తేనే ప్రజాస్వామం లేదంటే శూన్యం