Supreme Court : శివ‌సేన పార్టీ ఎవ‌రిద‌నే దానిపై తొంద‌ర వ‌ద్దు

ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

Supreme Court : దేశ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తి రేపిన ఏక్ నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే కు సంబంధించి శివ‌సేన పార్టీ ఎవ‌రిద‌నే దానిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దంటూ సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది. షిండే ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డితే అసెంబ్లీలో స‌భ్య‌త్వం కోల్పోతారని, వారు చెబుతున్న రాజ‌కీయ పార్టీ కాద‌ని ఈసీ కోర్టుకు(Supreme Court) స్ప‌ష్టం చేసింది.

దీనిపై విచార‌ణ జ‌రిపిన భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతానికి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దంటూ ఈసీకి సూచించారు.

మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభాన్ని బెంచ్ కు పంపాలా వ‌ద్దా అనే అంశంపై ధ‌ర్మాస‌నం నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు సీజేఐ. ఏక్ నాథ్ షిండే వ‌ర్గం వాద‌న‌ను వినేందుకు ఎన్నిక‌ల సంఘం ఆగ‌స్టు 8న తేదీని నిర్ణ‌యించింది.

దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. ఏ చ‌ర్య తీసుకోవ‌ద్దంటూ స్ప‌ష్టం చేశారు ఈసీకి. అన్ని ప‌క్షాల వాద‌న‌లు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సావ‌ధానంగా విన్నారు.

ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గం త‌ర‌పున క‌పిల్ సిబ‌ల్ వాదించారు. ఇక షిండే వ‌ర్గం త‌ర‌పున హ‌రీశ్ సాల్వే వాదించారు. మ‌హా వికాస్ అఘాడీ స‌ర్కార్ పై ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు.

ఆపై బీజేపీ స‌పోర్ట్ తో కొత్త స‌ర్కార్ ఏర్పాటు చేశారు. మొత్తం ఎమ్మెల్యేల‌లో 40 మందికి పైగా త‌న వైపు ఉన్నార‌ని క‌నుక శివ‌సేన పార్టీ త‌మ‌దేనంటూ కోర్టుకు ఎక్కారు.

దీనిపై ఈసీ స్పందించింది. దీనిని స‌వాల్ చేస్తూ ఉద్ద‌వ్ ఠాక్రే కోర్టును ఆశ్ర‌యించింది.

Also Read : 5జీ సేవ‌ల‌కు ఎయిర్ టెల్ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!