Supreme Court : జ్ఞాన్ వాపి మసీదు సర్వేను ఆపలేం
నిలిపి వేసేందుకు కోర్టు నిరాకరణ
Supreme Court : సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వారణాసి లోని జ్ఞాన్ వాపి మసీదు సర్వేను తక్షణమే నిలిపి వేసేందుకు ససేమిరా ఒప్పుకోనని స్పష్టం చేసింది.
ఈ సున్నిత అంశాన్ని తగిన సమయంలో పరిగణించాల్సి ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా భారత సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన
న్యాయమూర్తి ఎన్. వి. రమణ తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ వారణాసి సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసులో యథాతథ స్థితి కోసం సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ దావా దాఖలు చేశారు.
కాగా వారణాసి కోర్టు మసీదును తనిఖీ చేసేందుకు రోజూ వారీ సర్వే చేపట్టాలని ఆదేశించింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదు లోపల హిందూ దేవతల ఉనికికి సంబంధించి వీడియోగ్రఫీ నిర్వహించి , ఆధారాలు సేకరించాలని కోర్టు ఆదేశించింది.
వారణాసి ఆస్తికి సంబంధించి సర్వే చేయాలని ఆదేశించింది. ఇది ప్రార్థనా స్థలాల చట్టం కింద వర్తిస్తుంది. ఇప్పుడు సర్వే చేయాలని కోరటు కమిషనర్ ను ఆదేశించింది.. ఇది ఎప్పటి నుంచో మసీదుగా ఉంద అని న్యాయవాది అహ్మదీ కోర్టుకు(Supreme Court) విన్నవించారు.
కాగా జ్ఞాన్ వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది స్టేటస్ కో ఆర్డర్ జారీ చేయాలని కోరారు.
ఈనెల 17 లోగా జ్ఞాన్ వాపి మసీదు సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు ఆదేశించింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందంచారు. మేము పేపర్లు చూడలేదు.
విషయం ఏమిటో తెలియదు. అర్థం కాకుండా ఆర్డర్ ఎలా పాస్ చేయగలనని పేర్కొన్నారు.
Also Read : ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ పై నిరసన