Supreme Court : ప‌ర్మిష‌న్ కావాలంటే ఎన్ఐఏ ఇవ్వాల్సిందే

విప్ల‌వ క‌వి వ‌ర‌వ‌ర‌రావుకు సుప్రీంకోర్టు సూచ‌న‌

Supreme Court : స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాడంటూ ప్ర‌ముఖ విప్ల‌వ క‌వి వ‌ర‌వ‌ర‌రావును అరెస్ట్ చేసింది కేంద్ర జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ).

అనారోగ్యం దృష్ట్యా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ బొంబై హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆయ‌న పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది.

దీంతో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు వ‌ర‌వ‌ర‌రావు. ఆయ‌న కేసుకు సంబంధించి ఎన్ఐఏ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో సంచ‌ల‌న విష‌యాలు స్ప‌ష్టం చేసింది.

ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికైన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అక్ర‌మ ప‌ద్ద‌తిలో కూల్చేందుకు కుట్ర ప‌న్నారంటూ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయంటూ తెలిపింది.

మాన‌వ‌తా దృక్ఫ‌థంతో, అనారోగ్యం దృష్ట్యా ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు(Supreme Court) ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

కాగా త‌నకు క‌ళ్లు క‌నిపించ‌డం లేద‌ని, కంటికి శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంద‌ని, త‌న స్వ‌స్థ‌లం హైద‌రాబాద్ కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు వ‌ర‌వ‌ర‌రావు.

ఈ సంద‌ర్భంగా కోర్టు విచారించింది. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. హైద‌రాబాద్ కు వెళ్లాలంటే ఎన్ఐఏ కోర్టు అనుమ‌తి ఇవ్వాల‌ని త‌మ చేతుల్లో లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఇక విప్ల‌వ క‌వి త‌ర‌పున ఆనంద్ గ్రోవ‌ర్ వాద‌న‌లు వినిపించారు.

ఇక గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో వ‌ర‌వ‌రారావు మ‌రోసారి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ట్ర‌య‌ల్ కోర్టుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. తెలంగాణకు చెందిన ఈ విప్ల‌వ క‌వి మొద‌టి నుంచీ ప్ర‌భుత్వాల‌పై త‌న క‌లాన్ని ఎక్కు పెట్టారు.

Also Read : మోదీజీ ఇదేనా నారీ శ‌క్తి అంటే – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!