Supreme Court : ప్ర‌తి దానికి ప‌రిమితి ఉంటుంది – సుప్రీంకోర్టు

తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ధ‌ర్మాస‌నం

Supreme Court : ప్ర‌తి దానికి ప‌రిమితి ఉంటుంది. న్యాయమూర్తుల‌కు కూడా జీవితాలు ఉంటాయి. దానిని విస్మ‌రించి ఎలా ప‌డితే అలా తెలుసు కోకుండా క‌థ‌నాలు రాస్తే ఎలా అని తీవ్ర స్థాయిలో మండి ప‌డింది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం(Supreme Court).

విచార‌ణ‌లో జాప్యం చేస్తోందంటూ వ‌స్తున్న వ‌రుస ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించింది. న్యాయ‌మూర్తులు కూడా మ‌నుషులేన‌ని విస్మ‌రించిన‌ట్లుగా అనిపిస్తోందంటూ ప్ర‌ముఖ న్యాయూమ‌ర్తి డీవై చంద్ర‌చూడ్ , సూర్య‌కాంత్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది.

మాకు కూడా కొంత విరామం ఇవ్వాల్సిన స‌మ‌యం ఉంటుంద‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. దేనికైనా కొంత ప‌రిమితి, హ‌ద్దులు అనేవి ఉంటాయి.

వాటిని అతిక్ర‌మిస్తే చివ‌ర‌కు ఏమ‌వుతుంది ఆల‌స్యం అవుతుంది. దానిపై ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌ని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా క్రైస్త‌వ సంస్థ‌లు, పూజారుల‌పై దాడులు పెరుగుతున్నాయంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ‌ను కావాల‌ని ఆల‌స్యం చేస్తోందంటూ వ‌చ్చిన వార్తా క‌థ‌నాల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

దీనిపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక ర‌కంగా చుర‌క‌లు అంటించారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా ఏది ప‌డితే అది క‌థ‌నంగా అల్లేస్తే ఏంటి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చివ‌రి సారి నేను కోవిడ్ బారిన ప‌డ్డాను. కొంత ఆల‌స్యం జ‌రిగింది. అయితే విచార‌ణ కొన‌సాగుతోంది. ఒక కేసు విచార‌ణ‌కు వ‌చ్చిందంటే దాని పూర్వ ప‌రాలు, జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను మేం బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.

దీనిని అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల ఆల‌స్యం అవుతుందే తప్పా ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌న్నారు.

Also Read : పార్థ ఛ‌ట‌ర్జీపై చ‌ర్య‌కు టీఎంసీ సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!