SC Dismisses : దంతేవాడ గిరిజనుల హత్య కేసు కొట్టివేత
సామాజిక కార్యకర్తకు జరిమానా
SC Dismisses : ఛత్తీస్ గఢ్ లో గిరిజనులు పోలీసు కాల్పుల్లో చని పోయారని దీనికి వారే కారణమంటూ ఆ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త హిమాన్షు కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై న్యాయమూర్తులు ఏంఎ ఖాన్విల్కర్ , జేబీ పార్దివాలాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది.
అంతే కాకుండా పిటిషనర్ హిమాన్షుకుమార్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ పై అసత్య సాక్ష్యం కేసును(SC Dismisses) కొనసాగించాలన్న కేంద్ర సర్కార్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఇదిలా ఉండగా 2009లో ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో 17 మంది గిరిజనులు హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టి వేసింది.
విధించిన జరిమానాను సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్ద జమ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. కాగా కోర్టులో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినందుకు కేసు పెట్టాలన్న సర్కార్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా దంతేవాడలో వనవాసి చేతన ఆశ్రమం నడుపుతున్నారు పిటిషనర్ హిమాన్షుకుమార్. దంతేవాడ జిల్లాలో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ లో మూడు వేర్వేరు ఘటనల్లో 17 మంది గ్రామస్తులు చని పోయారు.
కాగా గ్రామస్థుల నుండి తనకు లభించిన వాంగ్మూలాల ఆధారంగా తన పిటిషన్ పై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ మరణాలన్నింటికి భద్రతా బలగాలే కారణమంటూ గ్రామస్థులు పేర్కొన్నారంటూ హిమాన్షు కుమార్ కోర్టుకు ఎక్కారు.
Also Read : పార్లమెంట్ లో నోరు జారితే జాగ్రత్త