SC On Demonetization : నోట్ల రద్దుపై సుప్రీం సంచలన తీర్పు
కీలక వ్యాఖ్యలు చేసిన గవాయి, నాగరత్న
SC On Demonetization : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కేంద్ర సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై కీలకమైన తీర్పు ప్రకటించింది. జనవరి 2 సోమవారం కోర్టులో నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటీషన్లపై విచారణ చేపట్టింది ధర్మాసనం. అయితే జస్టిస్ గవాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొనగా జస్టిస్ నాగరత్న మాత్రం విభేదించారు.
అయితే దామాషా ప్రకారం నోట్ల రద్దును కొట్టి వేయలేమంటూ పేర్కొంది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. 2016లో కేంద్ర సర్కార్ రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. జస్టిస్ ఎన్. ఎ. నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కాగా ధర్మాసనం లోని నలుగురు సభ్యులు నోట్ల రద్దును(SC On Demonetization) సమర్థించారు. ఆర్బీఐ, కేంద్ర సర్కార్ మధ్య సంప్రదింపులు జరిపాయని ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయ పడింది. ఆర్బీఐ రిలీజ్ చేసిన 2016 నవంబర్ 8 నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. జస్టిస్ గవాయి, బోపన్న, రామ సుబ్రమణియన్ నోట్ల రద్దును సమర్థించగా జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా తీర్పు చెప్పారు.
మరో వైపు ఆర్బీఐ చట్టం లోని సెక్షన్ 26 (2) కింద బ్యాంక్ నోట్లను రద్దు చేసేందుకు ఉపయోగించ వచ్చని తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్దమని చెప్పలేమంటూ పేర్కొంది.
గత కొంత కాలం నుంచి కేంద్ర సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు పై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేవలం డబ్బున్న వాళ్లకు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి.
Also Read : సుప్రీం తీర్పు నివేదికలు ఇక ఫ్రీ