Supreme Court : గ్యాంగ్ స్టర్ అబూ సలేం తనకు 25 ఏళ్లు దాటిన జైలు శిక్షపై వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రమైన, అత్యంత కఠినమైన పదాలు ఉపయోగించింది. న్యాయ వ్యవస్థపై కామెంట్స్ చేయొద్దని, ఉపన్యాసాలు ఇవ్వవద్దంటూ కేంద్రానికి చీవాట్లు వేసింది.
అబూ సలేంకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చంటూ హోం మంత్రిత్వ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
కేసుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన దానిని తమపై నెట్టి వేయడం ఎంత వరకు సబబు కాదంటూ పేర్కొంది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్ కే కౌల్ హోం మంత్రిత్వ శాఖకు సీరియస్ కామెంట్స్ చేశారు. తాము చెప్పదల్చుకున్న దానిలో కేంద్రం నిస్సందేహంగా ఉండాలని తెలిపాం.
హోం మంత్రిత్వ శాఖ అఫిడవిట్ లోని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం వంటి వాక్యాలు తమకు నచ్చవని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా హోం మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్ లో అబూ సలేం కేసుపై ప్రభుత్వం ఇది సరైన సమయం కాదంటూ పేర్కొంటూనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చంటూ తెలిపింది.
న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్ , ఎంఎం సుందరేష్ 1993 బొంబాయి పేలుడు కేసులో దోషిగా ఉన్న అబూ సలేం దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తున్నారు.
అబూ సలేంకు అతడి శిక్ష 25 వేళ్లకు మించబోమని పోర్చుగల్ ప్రభుత్వానికి ఉప ఉప్రధాని ఎల్కే అద్వానీ హామీ ఇచ్చారు.
Also Read : పీకే బ్లూ ప్రింట్ పై కాంగ్రెస్ ఆరా