Supreme Court of India : రిజర్వేషన్ రద్దుపై కోర్టు కామెంట్స్
సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court of India : కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల ఉపసంహరణకు సంబంధించిన కేసుపై జరుగుతున్న రాజకీయ ప్రకటనలను సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఉత్తర్వు ఉన్నప్పుడు మరింత పవిత్రతను కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని ముస్లింలకు ఓబీసీ కేటగిరీలో దశాబ్దాలుగా 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఆ దావాలపై విచారణ చేపట్టింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం. జూలైకి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టుకు(Supreme Court of India) సంబంధించిన విషయాలపై , వ్యాఖ్యలపై బహిరంగ ప్రకటనలు చేయరాదని , వాటికి రాజకీయాలతో సంబంధం లేదని కోర్టు పేర్కొంది. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపై హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీల ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ వెంటనే కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది దుష్వంత్ దవే మాట్లాడుతూ ముస్లింలకు తమ పార్టీ కోటాను ఉపసంహరించు కుంటున్నట్లు అమిత్ షా గర్వంగా చెబుతున్నారని తెలిపారు.
Also Read : అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలట్ ఫైర్