Supreme Court : ఢిల్లీ పోలీస్ తీరుపై ‘సుప్రీం’ సీరియ‌స్

నూపుర్ కోసం రంగంలోకి దిగిన పోలీసులు

Supreme Court : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ, త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌ను విచారించేలా ఢిల్లీకి మార్చాలంటూ నూపుర్ శ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టి వేసింది సుప్రీంకోర్టు(Supreme Court).

ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆపై ఢిల్లీ పోలీసుల‌ను క‌డిగి పారేశారు. ఇత‌రుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన వెంట‌నే అరెస్ట్ చేసిన మీరు ఎందుకు చేయ‌లేక పోయారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అధికారం ఉంది క‌దా అని నోరు పారేసుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. నూపుర్ శ‌ర్మ భ‌ద్ర‌త గురించి మాట్లాడుతోంది. మ‌రి ఆమె అనుచిత వ్యాఖ్య‌లు రేపిన దుమారం, జ‌రుగుతున్న న‌ష్టం ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌ని నిల‌దీశారు.

భార‌త దేశ ప్ర‌జ‌ల‌కు నూపుర్ శ‌ర్మ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఆయ‌న ఇచ్చిన తీర్పు, చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి.

ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా మండిప‌డ్డాయి. ఈ త‌రుణంలో ఢిల్లీ పోలీసులు ఎందుకు ఆమె ప‌ట్ల ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సామాన్యుల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకుంటారు..కానీ ఇంత బ‌ల‌గం, యంత్రాంగం పెట్టుకుని ఒక్క మ‌హిళ‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని సీరియ‌స్ అయ్యారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. జూన్ 18న నూపుర్ శ‌ర్మ వాంగ్మూలం తీసుకున్నామ‌ని చెప్పారు. అయితే ఆమె ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రిస్తోందంటూ తెలిపారు.

శ‌ర్మ‌పై సెక్ష‌న్ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు అంద‌జేసిన‌ట్లు డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మ‌ల్హోత్రా వెల్ల‌డించారు.

Also Read : 18 నుంచి పార్లమెంట్ స‌మావేశాలు

Leave A Reply

Your Email Id will not be published!