Supreme Court Stays : రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట
గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే
Supreme Court Stays : మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ కోర్టు విధించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే(Supreme Court Stays) విధించింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబురాలలో మునిగి పోయింది. దీంతో 2024లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలుగుతుంది. ఇదిలా ఉండగా ట్రయల్ జడ్జి కేసులో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ఈ విషయాన్ని గమనించింది. శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే అనర్హత పొందేందుకు వీలు కుదరదని పేర్కొంది.
Supreme Court Stays Viral
కాగా పరువు నష్టం కేసు కు సంబంధించి గుజరాత్ హైకోర్టు గతంలో రాహుల్ గాంధీపై జారీ చేసిన శిక్షకు సంబంధించిన తీర్పును స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉన్నత న్యాయ స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏది ఏమైనా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిపై మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని సూచించింది రాహుల్ గాంధీకి.
సూరత్ లోని సెషన్స్ కోర్టులో 2019 పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు తనను దోషిగా నిర్దారించడం తప్పని తన పిటిషన్లో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తన పట్ల కఠినంగా ప్రవర్తించిందని, ఎంపీగా తన స్థాయిని అధికంగా ప్రభావితం చేశారని వాపోయారు.
Also Read : Varla Ramaiah : సీఎంఓ కార్యాలయం అవినీతిమయం