Mohammed Zubair : జుబైర్ కేసును విచారించనున్న సుప్రీం
మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్
Mohammed Zubair : ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవళ విచారణ చేపట్టనుంది. హిందూ దార్శనికులను ద్వేష పూరితులంటూ పేర్కొన్నాడంటూ జుబైర్ పై యూపీలోని సీతాపూర్ లో కేసు నమోదైంది.
దీనిని పక్కన పెట్టాలని దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. దీనిని సవాల్ చేస్తూ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీంతో సదరు కేసుకు సంబంధించి ఇవాళ అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేపట్టనుంది. జుబైర్ ను గత నెల జూన్ 27న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు పర్చడంతో కస్టడీకి ఇచ్చింది కోర్టు. జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా యూపీలోని సీతాపూర్ లో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో అన్నీ తప్పులే ఉన్నాయని బాధితుడు జుబైర్ ఆరోపించారు.
తాను కావాలని వారిని దూషించ లేదని, వారే ద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారంటూ పేర్కొన్నాడు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నవన్నీ అబద్దాలేనంటూ వాపోయాడు.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన విషయాలు వెల్లడించాడు. 2018లో తాను చేసిన ట్వీట్ ను 2022లో పరిగణలోకి తీసుకుంటారంటూ ప్రశ్నించాడు మహ్మద్ జుబైర్(Mohammed Zubair).
ఇదిలా ఉండగా జుబైర్ చేసిన పని ఏమిటంటే. భారతీయ జనతా పార్టీకి చెందిన బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ ప్రవక్తపై చేసిన కామెంట్స్ ను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దాని దెబ్బకు ఇప్పుడు లబోదిబోమంటోంది సదరు నాయకురాలు. తనకు జుబైర్ నుంచి ముప్పు ఉందంటూ ఆరోపించింది. తాను నిర్దోషినని తాను ఎలాంటి నేరం చేయలేదన్నాడు.
Also Read : టైలర్ హత్య కేసులో బీజేపీ నోరు విప్పాలి