Supreme Court FIFA : ఫిఫా నిషేధంపై కోర్టు కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు
Supreme Court FIFA : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) తీసుకున్న చర్యలపై ఆలోచించాలని స్పష్టం చేసింది.
అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య పై ఫిఫా(Supreme Court FIFA) నిషేధం విధించింది. దీంతో భారత దేశంలో ఇప్పటికే ఫిఫా అండర్ -17 మహిళల వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంపై పునరాలోచించాలని పేర్కొంది కోర్టు.
ఈ వరల్డ్ కప్ ఇండియా నుంచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఫిఫా తో వెంటనే చర్చలు జరపాలని సూచించింది ధర్మాసనం. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరిపించింది.
అంతర్జాతీయ పరంగా ఉన్న సంబంధాలను ఆసరాగా చేసుకుని పునరుద్దరించేలా , అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) పై సస్పెన్షన్ ఎత్తి వేసేలా చూడాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే ఏర్పాటు చేస్తేనే పరువు నెలకొంటుందన్నారు. ఇదిలా ఉండగా విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడారు.
ఫిఫాతో చర్చలు జరుపుతున్నామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ఆగస్టు 22న విచారించాలని కోర్టును అభ్యర్థించారు.
దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం. ఇదిలా ఉండగా భారత ఫుట్ బాల్ సమాఖ్య తృతీయ పక్షం మితి మీరిన జోక్యం కారణంగా ఫిఫా వేటు వేసింది.
Also Read : అమ్మ చేతి వంట అంటే చచ్చేంత ఇష్టం