Supreme Court : నోట్ల రద్దుపై 12న సుప్రీం విచారణ
సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు
Supreme Court : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే పాత నోట్లను రద్దు చేయడం. కొత్త నోట్లను తీసుకు రావడం. ఇది పూర్తిగా రాజ్యాంగబద్దతకు వ్యతిరేకం అంటూ పలు పిటిషన్లు సర్వోన్నత న్యాయ స్థానం(Supreme Court) లో దాఖలయ్యాయి.
వీటిపై విచారణను సెప్టెంబర్ 28న విచారాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 12న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇందుకు న్యాయ పరమైన కారణాలే తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఉండగా ప్రధాని మోదీ 8 సెప్టెంబర్ 2016న దేశానికి చెందిన పాత రూ. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 500 నోటుకు బదులుగా కొత్త నోటు తీసుకు వచ్చింది. అయితే రూ. 1000 నోటును పూర్తిగా రద్దు చేసింది.
దాని స్థానంలో తీసుకు వచ్చిన రూ. 2,000 నోట్లు ముద్రించినా అవి అడ్రస్ లేకుండా పోయాయి. వీటిని హవాలా, బ్లాక్ మనీ దందా కింద ఎక్కువగా వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నోట్ల రద్దుకు సంబంధించి ముందస్తు సమాచారం లేకుండానే అర్థరాత్రి ప్రధాన మంత్రి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా వేలాది మంది జనం రోడ్డు పాలయ్యారు. నగదు దొరకక నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరారు. చాలా మంది వృద్దులు, మహిళలు సొమ్మ సిల్లి పడి పోయారు.
నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం చేకూరక పోగా పైగా అధికంగా ఖర్చు అయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నోట్ల రద్దును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read : మూడో స్థానానికి పడి పోయిన అదానీ