Supriya Sule : మరాఠాపై బీజేపీ కుట్ర – సుప్రియా సూలే
రాజకీయ లబ్ది కోసమే సరిహద్దు వివాదం
Supriya Sule : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. కర్ఱాటక పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వాహనాలపై దాడులకు తెగబడ్డారు. మరో వైపు కర్ణాటక సీఎం కన్నడ మాట్లాడే గ్రామాలన్నీ తమవేనంటూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు.
ఎవరైనా గొడవలు వద్దని అనుకుంటారు. కానీ బస్వరాజ్ బొమ్మై మాత్రం కావాలని మహారాష్ట్రతో గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. విచిత్రం ఏమిటంటే ఈ రెండు రాష్ట్రాలలో కొలువు తీరింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే. మరి ఎందుకు సమస్యను జఠిలం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
పార్లమెంట్ లో సరిహద్దు వివాదానికి గల కారణం ఏమిటనేది కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకర్ణీ సర్కార్ కు తెలియాలని ఎద్దేవా చేశారు. ఒక రకంగా చూస్తే మరాఠాపై బీజేపీ కక్ష కట్టినట్టు అనిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సుప్రియా సూలే(Supriya Sule).
కర్ణాటక సీఎం గొడవలు మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అందుకనే వరుసగా దాడులు చోటు చేసుకున్నాయని దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సింది సీఎం బొమ్మై అంటూ ఆరోపించారు ఎన్సీపీ ఎంపీ.
రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ప్రశ్నించారు. దీనికి ప్రధానమంత్రి మోదీ సమాధానం ఇవ్వాలని సుప్రియా సూలే డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా మరాఠాపై కుట్ర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా కేంద్రం కల్పించుకుని విద్వేషాలు రెచ్చగొట్టకుండా చూడాలని సూచించారు ఎంపీ. ఇన్ని దాడులు జరుగుతున్నా మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు.
Also Read : నిన్న సామాన్యులు నేడు విజేతలు