MLC Kavitha : క‌విత పిటిష‌న్ సుప్రీంకోర్టు స్వీక‌ర‌ణ

ఆరు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాలి

MLC Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆప్ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు ప‌లువురు జైలు ఊచ‌లు లెక్క బెడుతున్నారు. ఈ త‌రుణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యురాలు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha). ఆమె ఫోన్ నెంబ‌ర్ల‌ను ఎలా మార్చింద‌నే విష‌యంపై కూడా క్లారిటీ ఇచ్చింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు. ఇదే స‌మ‌యంలో క‌విత‌ను ఈడీ ఢిల్లీకి విచార‌ణ నిమిత్తం పిలిపించింది. తాను ఒక మ‌హిళ‌న‌ని చూడ‌కుండా ఈడీ అధికారులు త‌న స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించేలా చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

MLC Kavitha Petition

ఈ మేర‌కు క‌ల్వ‌కుంట్ల క‌విత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీపై పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఎమ్మెల్సీ క‌విత ప‌క్షాన నిలిచింది కోర్టు. ఈడీపై క‌విత దాఖ‌లు చేసిన దావాను కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. ఇదిలా ఉండ‌గా శుక్రవారం స‌ర్వోన్న‌త న్యాయ స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. విచార‌ణ కోసం మ‌హిళ‌ను ఈడీ ఆఫీసుకు పిలిపించ‌వ‌చ్చా లేదా అన్న అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు. త‌న‌ను పిలిపించడాన్ని స‌వాల్ చేస్తూ క‌విత కోర్టుకు ఎక్కింది.

కాగా క‌విత పిటిష‌న్ పై ఆరు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఈడీని ఆదేశించింది. ఇదే స‌మ‌యంలో రెండు వారాల్లో రిజైన్డ‌ర్ దాఖ‌లు చేయాల‌ని క‌విత‌కు సూచించింది. కోర్టులో క‌విత త‌ర‌పున సీనియ‌ర్ లాయ‌ర్లు క‌పిల్ సిబ‌ల్ , ముకుల్ రోహ‌త్గితో పాటు తెలంగాణ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ జే రామ‌చంద‌ర్ రావు హాజ‌ర‌య్యారు.

Also Read : Chandrashekhar Azad : క‌విత‌తో చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!