Hijab Row : హిజాబ్ వివాదంపై కోర్టు కామెంట్స్
ధరించే హక్కు తో పాటు విప్పే హక్కుందా
Hijab Row : కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం(Hijab Row) తీవ్ర సంచలనం కలిగించింది. ఇప్పటికే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు ధరించే హక్కులో దుస్తులు విప్పే హక్కుడా ఉంటుందా అని ప్రశ్నించింది.
చాలా మంది విద్యార్థులు రుద్రాక్షలు లేదా శిలువ కూడా ధరిస్తారన్న న్యాయవాది వాదించారు. దీనికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ హేమంత్ గుప్తా.
రుద్రాక్ష లేదా శిలువ లేదా ఇంకేదైనా గుర్తింపు చిహ్నం లోపల ధరించి ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీలో హిజాబ్ ధరించడాన్ని తప్పు పట్టింది యాజమాన్యం.
హిజాబ్(Hijab Row) లేకుండా వస్తేనే పాఠశాలలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇది తమ ఆచారమని దీనిని తాము పాటిస్తామని కానీ బడులకు , కాలేజీలకు రామంటూ హిజాబ్ ధరిస్తూ ఆందోళన చేపట్టారు.
ఇది వివాదం రాద్దాంతాన్ని రేపింది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దారి తీసింది. న్యాయవాది ప్రశ్నలకు సీరియస్ గా తీసుకున్నారు జడ్జి. పాఠశాలలో ఎవరూ బట్టలు విప్పడం లేదంటూ దేవ్ దత్ కామత్ పేర్కొన్నారు.
మీ వరకు ధరించాలా వద్దా అన్నది మీ హక్కు. దానిని కాదనలేం. కానీ ఒక విద్యా సంస్థ కు చదువుకునేందుకు వచ్చే ఎవరైనా సదరు పాఠశాల రూల్స్ పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
Also Read : ప్రెసిడెంట్ ప్రసంగం చిన్నారి ఆనందం