Suprme Court Centre Govt : కేంద్ర సర్కార్ తీరుపై ‘సుప్రీం’ సీరియస్
న్యాయమూర్తుల నియామకం ఆలస్యం
Suprme Court Centre Govt : న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరింత ఆలస్యం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కొలీజియం వ్యవస్థపై గత కొంత కాలంగా న్యాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్.
పార్లమెంట్ లో చట్టం చేసిన దానిని సర్వోన్నత న్యాయ స్థానం ఎలా తిరస్కరిస్తుందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా అత్యున్నత న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర స్థాయిలో గురువారం వాదోపవాదాలు జరిగాయి.
ఈ కేసును సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. కోర్టు ప్రకటించే ఏ చట్టం అయినా వాటాదారులందరికీ కట్టుబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉప రాష్ట్రపతి రాజ్యసభలో పదే పదే ప్రస్తావించడాన్ని తప్పు పట్టింది. సుప్రీంకోర్టు(Suprme Court Centre Govt) కొలీజియంపై వ్యాఖ్యలు చేయడం, బహిరంగంగా రాజ్యాంగ అధికారులు చేసిన ప్రసంగాలు తీసుకోబడవు.
మీరు వారికి సలహాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కు సూచించింది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్ , అభయ్ ఎస్ ఓ కా , విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ సందర్భంగా ఏజీ ఆర్. వెంకట రమణికి తెలిపింది.
రేపు ప్రాథమిక నిర్మాణం కూడా రాజ్యాంగంలో భాగం కాదని ప్రజలు అంటారు. సమాజంలోని ప్రతి వర్గం ఏ చట్టాన్ని అనుసరించాలి. ఏది కాదు అని చెప్పడం ప్రారంభిస్తే అది విచ్ఛిన్నానికి దారి తీస్తుందని హెచ్చరించింది.
Also Read : 12న గుజరాత్ లో బీజేపీ సర్కార్ ఏర్పాటు