Surat Jewellers Carves Modi : నరేంద్ర మోదీ బంగారు ప్రతిమ
ఆకట్టుకున్న సూరత్ జ్యువెలరీ తయారీ
Surat Jewellers Carves Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతూనే ఉంది. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అద్బుతమైన నాయకుడిగా పేరొందారు. ఈ తరుణంలో ప్రతిమలు కూడా తయారు చేయడంలో పోటీ పడుతున్నారు.
తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో 156 సీట్లను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అరుదైన రికార్డు గా నమోదైంది ఎన్నికల చరిత్రలో.
ఘన విజయానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఎల్లకాలం గుర్తు పెట్టుకునే విధంగా సూరత్ నగరానికి చెందిన జ్యువెలర్ మోదీ ప్రతిమను తయారు చేశారు. మొత్తం బీజేపీ 156 సీట్లు గెలుచుకున్నందుకు గాను 156 గ్రాముల బంగారంతో దీని కోసం ఉపయోగించారు. దీనికి రూ. 11 లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఆభరణాల తయారీదారు.
18 క్యారెట్లు ఉన్న బంగారంతో మోదీ ప్రతిమను(Surat Jewellers Carves Modi) అందంగా చెక్కారు. ఘన విజయాన్ని సాధించినందుకు గాను దీనిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు చెప్పారు సూరత్ ఆభరణాల తయారీ సంస్థ రాధికా చైన్స్ యజమాని బసంత్ బోహ్రా.
విచిత్రం ఏమిటంటే ఇప్పుడు దీనిని చూసేందుకు, కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతుండడం విశేషం. అయితే స్వర్ణకారుడు ఇంకా విక్రయించాలని అనుకోలేదు. నేను నరేంద్ర మోదీ అభిమానిని. ఆయనకు నివాళిగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నా. దాదాపు 20 మంది కళాకారులు దీనిని తయారు చేయడంలో నిమగ్నమయ్యారని తెలిపారు.
ఒకవేళ దీనిని గనుక అమ్మకానికి పెడితే భారీ ఎత్తున అమ్ముడు పోయే అవకాశం ఉంది.
Also Read : మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై ఫిర్యాదు