Suresh Kondeti : సంతోషం వేడుకలకు సర్వం సిద్ధం
గోవా సీఎంతో సురేష్ కొండేటి భేటీ
Suresh Kondeti : సినీ జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా, నటుడిగా సంతోషం అనే మ్యాగజైన్ అధినేతగా పలు భిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకు వెళుతున్నారు సురేష్ కొండేటి. సంతోషం అవార్డుల పేరుతో సినీ రంగంలో సత్తా చాటుతున్న నటీ నటులు టెక్నీషియన్లను సాదరంగా గౌరవిస్తూ ప్రతి ఏటా అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
Suresh Kondeti Santosham Awards Function Updates
ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటికీ ఈ అవార్డులు అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మొట్ట మొదటిసారిగా గోవాలో ఈ అవార్డుల వేడుక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
పురస్కారాల కార్యక్రమం గురించి సీఎంతో భేటీ అయ్యారు సురేష్ కొండేటి(Suresh Kondeti). ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గత 21 ఏళ్లుగా ఈ అవార్డులను ఇస్తూ రావడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు సీఎం.
ఇదిలా ఉండగా గోవాలో త్వరలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుందని, దీని తర్వాత సంతోషం పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు సురేష్ కొండేటి.
Also Read : Minister KTR : కాంగ్రెస్ దౌర్జన్యం కేటీఆర్ ఆగ్రహం