కర్ణాటక సీఎం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఇంకా ఏఐసీసీ మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉండగా సీఎం పోస్టును ఆశిస్తున్న, రేసులో నిలిచిన మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరూ హస్తినకు చేరుకున్నారు. మర్యాద పూర్వకంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలుసుకున్నారు. అంతకు ముందు రాహుల్ గాంధీకి వదిలి వేశారు ఎంపిక చేసే విషయం. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే రాహుల్ డీకే వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
ఇక ఖర్గే, డీకేల మధ్య సంభాషణ 30 నిమిషాలకు పైగా సాగింది. విశ్వసనీయ నివేదికల ప్రకారం సిద్దరామయ్యకు కాకుండా డీకేనే ప్రిఫర్ చేసినట్లు తెలిసింది. రెండో ఫార్ములా కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ఇద్దరిలో ఒకరు సీఎంగా మరొకరు డిప్యూటీ సీఎంగా ఉండడం, రెండేళ్ల పాటు పంచుకునేలా చేయడం . ఈ చర్చలలో ప్రధానంగా డీకే శివకుమార్ ఏఐసీసీ మాజీ చీఫ్ మేడం సోనియా గాంధీ ఏమని అనుకుంటున్నారో తెలుసు కోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పినట్లు టాక్.
ఓ వైపు చర్చలు కొనసాగుతుండగానే మరో వైపు డీకే శివకుమార్ తన పదవికి రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిని డీకేఎస్ ఖండించారు. పరువు నష్టం వేస్తానని హెచ్చరించారు.
