CJI Suspence : సీజేఐ నియామకంపై సస్పెన్స్
ఖరారు చేయని కొలీజియం
CJI Suspence : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ పదవీ కాలం స్వల్ప కాలమే. త్వరలోనే ఆయన పదవీ విరమణ పొందనున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం తదుపరి సీజేఐగా(CJI Suspence) ఎవరు ఉండాలనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కొలీజియం కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేస్తుంది.
వచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సమక్షంలో పరిశీలిస్తుంది. ఎంపిక చేసిన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపుతుంది. ప్రస్తుత సీజేఐ, పీఎంతో సంప్రదింపుల అనంతరం సంతకం చేస్తారు.
అనంతరం అధికారికంగా సీజేఐ ప్రకటించడం, ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు పెద్ద సస్పెన్ష్ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే తదుపరి సీజేఐ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కొలీజియం సమావేశం నిర్వహించ లేదు. ఎవరినీ ఖరారు చేయలేదు.
ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సీనియార్టీ ప్రకారంగా చూస్తే జస్టిస్ డీవై చంద్రచూడ్ యుయు లిలిత్ కంటే ముందు సీజేఐగా కావాల్సి ఉంది. అంతా ఆయననే తదుపరి ప్రధాన న్యాయమూర్తి అవుతారని భావించారు.
కానీ కేంద్రం కేవలం మూడు నెలల కాలానికి చంద్రచూడ్ కాకుండా లలిత్ కు అవకాశం ఇవ్వాలని అప్పటి సీజేఐ ఎన్వీ రమణకు సూచించింది. ఆ మేరకు జస్టిస్ లలిత్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా సీజేఐ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తదుపరి రేసులో ఉన్నారు.
Also Read : లిక్కర్ పాలసీ కేసులో 35 చోట్ల దాడులు